Home / Entertainment / Bollywood / తెలంగాణలో కొత్తగా 62 మందికి కరోనా.. మరో ముగ్గురు మృతి

తెలంగాణలో కొత్తగా 62 మందికి కరోనా.. మరో ముగ్గురు మృతి

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య నాలుగు రోజులుగా భారీగా పెరుగుతోంది. ఇవాళ ఒకేరోజు 62 పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో 62 మందికి కరోనా సోకింది, ముగ్గురు మృతిచెందారు.. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1,761 చేరింది. కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 48కి పెరిగింది.. ప్రస్తుతం రాష్ట్రంలో 670 మంది కరోనాతో చికిత్స పొందుతుండగా ఇవాళ కరోనా నుంచి కోలుకుని ఏడుగురు డిశ్చార్జ్ అయ్యారు.. ఇప్పటి వరకు 1,043 మంది డిశ్చార్జ్ అయినట్టు అధికారులు వెల్లడించారు. ఇవాళ నమోదైన కేసుల్లో హైదరాబాద్ పరిధిలోనే 42 కేసులు ఉండగా, రంగారెడ్డి జిల్లాలో ఒకటి.. ఇతర రాష్ట్రాలకు చెందినవారు 19 మంది ఉన్నారు.