Home / Entertainment / Bollywood / పేరు మార్చుకుంటాను అంటున్న రష్మిక.. ఫ్యాన్స్‌ కామెంట్స్‌

పేరు మార్చుకుంటాను అంటున్న రష్మిక.. ఫ్యాన్స్‌ కామెంట్స్‌


టాలీవుడ్‌లో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి గీతాగోవింద సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రష్మిక మందన్న. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో వరస విజయాలతో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరితమైన రష్మిక సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తుంది. తన జీవితంలోని ఆసక్తికర విషయాలను వాళ్లతో పంచుకుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు తనకు రష్మిక కాకుండా మరో సూట్ అయ్యే పేరు చెప్పమని అభిమానుల కోరింది ఈ కన్నడ బ్యూటీ. తాజాగా ఫ్యాన్స్‌తో మాట్లాడుతూ తను ఒకవేళ పేరు మార్చుకోవాల్సి వస్తే ఏ పేరు బాగుంటుందని అడిగింది. దానికి చాలా మంది డియర్ కామ్రేడ్‌లోని లిల్లీ పేరు సూచించారు. మరికొందరు ఓ అడుగు ముందుకేసి రష్మిక దేవరకొండ అని కామెంట్‌ చేయగా.. మోనీ, తలా రష్మిక, పింకీ, శాన్వీ లాంటి పేర్లను కూడా సూచించారు. మరికొందరు మాత్రం.. మీ పేరు అందంగా ఉంది.. ఎందుకు మేడమ్ పేరు మార్చుకోవడం అంటు కామెంట్ చేశారు.