Home / Entertainment / Bollywood / తెలంగాణలోవిజృంభిస్తున్న కరోనా, ఒకేరోజు ఐదుగురు మృతి

తెలంగాణలోవిజృంభిస్తున్న కరోనా, ఒకేరోజు ఐదుగురు మృతి

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఇవాళ ఒక్కరోజే రాష్ట్రంలో కరోనా కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య 45కి చేరింది. ఇవాళ కొత్తగా 38 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రం మొత్తంలో కరోనా బాధితుల సంఖ్య 1699కి చేరింది. ఇవాళ నమోదైన కేసుల్లో 26 హైదరాబాద్‌ పరిధిలోనివి కాగా, రంగారెడ్డి జిల్లాలో 2, మరో 10 మంది వలస కార్మికులకు కరోనా సోకింది.

తెలంగాణలో ఇవాళ కరోనా నుంచి కోలుకుని 23 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 1063 మంది డిశ్చార్జి అయినట్లు అధికారులు తెలిపారు. మరో 618 మంది కరోనాతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలోని 3 జిల్లాల్లో ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అలాగే 25 జిల్లాల్లో గత 14 రోజులుగా కరోనా పాజిటివ్ కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదని తెలిపారు.