Home / Entertainment / Bollywood / తెలంగాణలో 1661 కరోనా కేసులు

తెలంగాణలో 1661 కరోనా కేసులు


తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 1661కి చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో హైదరాబాద్ పరిధిలో 15 కేసులు నమోదు కాగా, ఇతర రాష్ట్రాలకు చెందిన 12 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. కరోనాతో ఇవాళ ఇద్దరు మృతి చెందగా ఇప్పటి వరకు కరోనా బారిన పడి తెలంగాణ వ్యాప్తంగా 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 609 మంది ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. కరోనా నుంచి కోలుకుని ఇవాళ ఇద్దరు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్టు అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయినవారి సంఖ్య 1013 కు చేరింది.