Home / Entertainment / Bollywood / ఎన్టీఆర్‌ బర్త్‌డే గిఫ్ట్‌ వచ్చేసింది.. స్టన్నింగ్‌ లుక్‌

ఎన్టీఆర్‌ బర్త్‌డే గిఫ్ట్‌ వచ్చేసింది.. స్టన్నింగ్‌ లుక్‌


టాలీవుడ్‌ స్టార్‌ హీరో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ పుట్టినరోజు కోసం అభిమానులు ఆశగా చూస్తున్నారు. ఈయన పుట్టిన రోజుకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి టీజర్ రాకపోయినా కూడా సర్‌ప్రైజులు మాత్రం బాగానే వస్తున్నాయి. అందులో భాగంగానే ఆయన పర్సనల్ జిమ్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇస్తానని ప్రామిస్ చేసాడు. చెప్పినట్లుగానే ఈయన సర్‌ప్రైజ్ ఇచ్చేసాడు. ఇప్పటి వరకు చూడనటువంటి జూనియర్ ఎన్టీఆర్ అదిరిపోయే సిక్స్ ప్యాక్ చూపించాడు. ఇప్పటికే టెంపర్ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేసాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే ఆ సినిమా తర్వాత మళ్లీ ఇప్పటి వరకు ఈయన అలా కనిపించింది లేదు.

వరుస హిట్‌లతో ఉన్నాడు ఎన్టీఆర్‌. అయితే అందులో అరవింద సమేత సినిమాలో ఈయన షర్ట్ విప్పి సిక్స్ ప్యాక్ చూపించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరింత అదిరిపోయేలా అన్‌సీన్ స్టిల్ ఒకటి విడుదల చేసాడు లాయిడ్. అందులో హాలీవుడ్ హీరో మాదిరి షర్ట్ విప్పేసి చుక్కలు చూపిస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇది చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.