Home / Entertainment / Bollywood / తెలంగాణలో బస్సు సర్వీసులకు ప్రభుత్వం అనుమతి

తెలంగాణలో బస్సు సర్వీసులకు ప్రభుత్వం అనుమతి


తెలంగాణలో ప్రజా రవాణాకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. రేపు ఉదయం 6 గంటల నుంచి బస్సులునడుస్తాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు. అయితే సిటీ బస్సులకు అనుమతి లేదని తెలిపారు. రాష్ట్రంలో ఆటోలు, ట్యాక్సీలకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. అయితే నిబంధనలు పాటించాలని అన్నారు. ఆటోలో డ్రైవర్ ఇద్దరు ప్రయాణికులు, ట్యాక్సీలో డ్రైవర్ ముగ్గురు ప్రయాణికులు మాత్రమే ఉండాలన్నారు. రాష్ట్రంలో ఈకామర్స్ సేవలకు అనుమతిచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పరిశ్రమలు 100 శాతం సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చన్నారు. కరోనా జాగ్రత్తలు తప్పక పాటించాలని వెల్లడించారు. రేపటి నుంచి హైదరాబాద్‌ మినహా తెలంగాణ రాష్ట్రంలో అన్ని షాపులూ తెరుచుకోవచ్చు. హైదరాబాద్‌లో మాత్రం సరి-భేసి విధానం అమలు చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా సెలూన్లకు అనుమతి ఇస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. మే 31 వరకు రాష్ట్రంలో కర్ఫ్యూ యథాతథంగా ఉంటుందన్నారు.

తెలంగాణలో కంటైన్‌మెంట్ జోన్లు మినహా మిగతావి అన్నీ గ్రీన్ జోన్లేనని కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో 1452 కుటుంబాలు మాత్రమే కంటైన్‌మెంట్ ప్రాంతంలో ఉన్నట్లు కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో లాక్‌డౌన్‌ ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. కంటైన్‌మెంట్ ప్రాంతంలో వాటి ప్రభావం ఉన్న పరిసర ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమల్లో
ఉంటుందని తెలిపారు. కంటైన్‌మెంట్ ప్రాంతం పూర్తిగా పోలీసుల పహారాలో ఉంటుందని అన్నారు. కంటైన్‌మెంట్‌లోని కుటుంబాలకు నిత్యావసరాలను ప్రభుత్వమే సరఫరా చేస్తుందని అన్నారు. కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలన్నారు. బతుకుదెరువు కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పోవాలన్నారు.